Wednesday, May 8, 2024

Operation Valentine | ఫస్ట్ స్ట్రైక్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్‌’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. కాగా, ఈ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు వరుణ్​. కాగా, సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న విడుదల కానుంది. తాజాగా.. ఆపరేషన్ వాలెంటైన్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్‌ని ఈ నెల (డిసెంబర్) 18న 11:05 AM కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement