Monday, May 20, 2024

BJP MLA – అసెంబ్లీకి పంపిన ఇందూరు ప్ర‌జ‌ల‌కు సేవకుడిగా ఉంటా – ధ‌న్పాల్

నిజామాబాద్ సిటీ డిసెంబర్ (ప్రభ న్యూస్)16: అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన ఇందూరు ప్రజలకు రుణపడి ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనా రాయణ అన్నారు.ఉత్కంఠ గా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల్లో… సమాజ సేవకు డిగా.. ప్రజల మనసు గెలిచి… భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి… అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శనివారం మొట్ట మొదటిసారిగా నిజామాబాద్ నగరానికి విచ్చేసిన. ధన్పాల్ సూర్యనారాయణకు అడుగడు గునా.. ఇందూర్ ప్రజలు నీరాజనం పలికారు. జైశ్రీరామ్ నినాదాలతో ఇందూరు దద్దరి ల్లింది.

నిజామాబాద్ నగరం లోని మాధవ నగర్ సాయిబా బా, లక్ష్మీ గణపతి ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలికి ఎమ్మెల్యేను ఘనంగా సన్మా నించారు. అర్బన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి నిజాంబాద్ పట్ట ణానికి విచ్చేసిన సందర్భంగా బోర్గాం బ్రిడ్జి వద్ద నేల తల్లి కి నమస్కరించి… బైక్ ర్యాలీని ప్రారంభించారు. బోర్గాం బ్రిడ్జి వద్ద.. బిజెపి నాయకులు గజమాలతో ఘనంగా సత్క రించారు.. కమలం గుర్తుతో… కాషాయ మయంగా ప్రత్యేకంగా అలంకరించిన బుల్లెట్ వాహనంపై ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్ దన్పాల్ పాల్గొన్నారు. యువకులు కేరింతలతో బైక్ ర్యాలీలో నృత్యాలు చేస్తూ సంబురంగా పాల్గొన్నారు.. నగరంలోని పుర వీధులలో ఇందూరు ప్రజలు ధన్పాల్ సూర్యనారాయణకు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరంలోని బోర్గాం బ్రిడ్జి వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ , హనుమాన్ జంక్షన్ , పూలంగ్, గోల్ హనుమాన్, పెద్ద బజార్, గాంధీ చౌక్ బస్టాండ్, రైల్వే స్టేషన్,సుభాష్ నగర్ వద్ద గల అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యలయం వరకు ర్యాలీ కొనసాగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement