Monday, May 6, 2024

USA Pre sales | రిలీజ్‌కు ముందే “సలార్” రికార్డుల వరద!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా… ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”. మరో వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమాపై హైప్ మరింత పెరుగుతూ వస్తుంది. ఇక యూఎస్ బుకింగ్స్‌లో సలార్ మాస్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తొంది.

ఈ మూవీ యూఎస్‌లో 8 లక్షల డాలర్స్ మార్క్‌ని జస్ట్ ప్రీ సేల్స్ లోనే కొట్టేసింది. దీంతో రానున్న రోజుల్లో ఈ మార్క్ 1 మిలియన్ మార్క్‌ని కూడా కొట్టేస్తుంది అని చెప్పాలి. మొత్తానికి యూఎస్ మార్కెట్‌లో సలార్ హైప్ అలా పెరుగుతూనే వెళ్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement