Sunday, May 19, 2024

Odisha : నవీన్​పై మోదీ ఫైర్.. ఒడిశాను దోచేశారని ఆగ్రహం

అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేడీ
ఒడిశా వెనుక‌బాటుకు కార‌ణం ఆ పార్టీనే
బీజేడీలో అంద‌రూ అవినీతిప‌రులే
అభివృద్ధికి కేటాయింపులు చేయ‌ని ప్ర‌భుత్వం
10 ఏళ్ల‌లో ఒడిశాకు ₹3.50 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చాం
10 ఏళ్ల‌లో నవీన్​ ప‌ట్నాయ‌క్​ను ఒక్క మాట అన‌ని మోదీ
ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఫ్రెండ్లీ పార్టీపై గ‌రం గ‌రం
నేడు ఏపీలోని రాజ‌మండ్రి, అన‌కాప‌ల్లిలో మోదీ స‌భ‌లు
హాజ‌రుకానున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్
ఒడిశా : నాడు కాంగ్రెస్ పార్టీ ఒడిశా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటే, నేడు బీజేడీ కూడా అదే పని చేస్తోందని ప్ర‌ధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రంలోని సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పుష్కలంగా నీళ్లు, సారవంతమైన భూములు, విస్తారమైన తీర ప్రాంతం, ఘనమైన చరిత్ర, సంస్కృతి.. ఇలా ఒడిశాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ ఇక్కడి పాలకుల తీరు వల్ల రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడే ఉందని విమర్శించారు.

బీజేడీ నేత‌లు.. అవినీతిప‌రులు…
ఒడిశాలోని గంజాంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.., బిజు జనతా దల్ (బీజేడీ) నేతల అవినీతి, అక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. బీజేడీకి చెందిన చోటామోటా లీడర్ కూడా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నారని ఆరోపించారు.. రాష్ట్రంలోని చాలా ఆసుపత్రుల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఎందుకు ఉన్నాయని, వైద్యుల నియామకం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. చిన్నారులు మధ్యలోనే చదువుకు దూరమయ్యే పరిస్థితి ఎందుకు నెలకొందని నిలదీశారు.

అభివృద్ధికి నిధులెక్క‌డ…
అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర బడ్జెట్​లో నిధులు కేటాయించకపోవడమేనని విమర్శించారు ప్ర‌ధాని. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిశాను చిన్నచూపు చూసిందని అంటూ గ‌తంలో మన్మోహన్ సర్కారు పదేళ్లలో ఒడిశాకు కేవలం ₹1 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. అదే పదేళ్ల ఎన్డీఏ హయాంలో కేంద్ర బడ్జెట్ లో ఒడిశాకు ₹3.5 లక్షల కోట్లు కేటాయింపులు జరిగాయని వివరించారు. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన సమయంలో కేంద్ర సర్కారు రూ.6 వేలు ఆర్థిక సాయం చేసేందుకు ప్రవేశ పెట్టిన స్కీమ్ ను బీజేడీ సర్కారు రద్దు చేసిందని ఆరోపించారు.

- Advertisement -

ఫ్రైండ్లీ ఫైట్ ..
తమకు, బీజేడీ మధ్య ఒడిశాలో ఫ్రెండ్లీ ఫైట్ మాత్రమే ఉంటుందని ఒడిశా బీజేపీ నేతలు గతంలో చాలాసార్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయలేదు. ఆ పార్టీ నేతలు కూడా సంయమనం పాటించారు. దీనికి విరుద్ధంగా ప్రధాని మోదీ సోమవారం పట్నాయక్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో అక్క‌డ బిజెడిలో క‌ల‌క‌లం బ‌య‌లుదేరింది.. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ నియోజకవర్గాల్లో మే 13 నుంచి మొత్తం నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది.

నేడు ఏపీలో ప్ర‌ధాని పర్యటన…
సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశాన్ని చుట్టేస్తున్న ప్రధాని మోదీ సోమవారం ఏపీలో పర్యటించనున్నారు. రాజ‌మండ్రి, అనకాపల్లి జిల్లాలో ప్రచారం ఉండనుది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి మోదీ రానున్నారు. సాయంత్రం రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.. రాజమండ్రి ఎయిర్ పోర్టులో దిగి నేరుగా సభ వేదికకు వెళ్లనున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి వెళ్తారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం దగ్గర కూటమి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీతో పాటు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement