Thursday, May 16, 2024

Salaar | కొనసాగుతున్న స‌లార్ జోరు.. 3 రోజూ రికార్డు కలెక్షన్స్

రెబల్ స్టార్ ప్రభాస్ పేరు యావత్ భారతదేశం మారుమోగుతోంది. సాలార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము రేపుతున్నాడు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. చాలా గ్యాప్ తర్వాత అభిమానులు కోరుకున్నట్లుగా ప్రభాస్ కనిపించాడు.. దీంతో ఈ సినిమా రూ. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే 402 కోట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

కేవలం మూడు రోజుల్లో 402 కోట్ల రూపాయలు రాబట్టడం పట్ల ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజున క్రిస్మస్ సెలవు కావడంతో వసూళ్ల జోరు తగ్గే అవకాశం లేదు. ఆ తరువాత కూడా ఇదే జోరు కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement