Saturday, May 4, 2024

ఆర్ఆర్ఆర్ పోస్టర్ తో ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ !!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ తో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.

2020 మే నెలలో రిలీజ్ అయిన కొమరం భీం పోస్టర్ కు ట్విట్టర్ లో మొత్తం రెండు లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. తెలుగు హీరోల పోస్టర్ కి కూడా ఈ స్థాయిలో కామెంట్లు రాలేదు. దీంతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఇదే విషయమై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement