Sunday, May 5, 2024

జూనియర్ ఎన్టీఆర్ @5మిలియన్ ఫాలోవర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. డైలాగ్ చెప్పాలన్నా, డాన్స్ వేయాలన్నా… ఎన్టీఆర్ తర్వాతే అన్నట్టుగా నిరూపించుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో తాజాగా ఓ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. ట్విట్టర్ లో 5 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ ఈ రికార్డును క్రియేట్ చేశాడు.

మామూలుగా ఎన్టీఆర్ సోషల్ మీడియాను అతి తక్కువగా వాడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement