Sunday, April 28, 2024

Nitin బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమాల‌ గ్లింప్స్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘రాబిన్ హుడ్’. కాగా, ఇవ్వాల నితిన్ పుట్టినరోజు కావడంతో ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. భీష్మ తరహా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. గతంలో భీష్మ సినిమా చేసిన వీరిద్దరూ రాబిన్ హుడ్ సినిమాతో మరో సారి చేతులు కలపడంతో ఈమూవీపై అభిమానుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.

నితిన్ పుట్టినరోజు సందర్భంగా నితిన్ ‘తమ్ముడు’ మూవీకి సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలైంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement