Thursday, May 2, 2024

LSG vs PBKS | హోమ్ గ్రౌండ్‌లో చెలరేగిన లక్నో.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే

ఐపీఎల్ 2024 లలో భాగంగా ఇవ్వాల హోమ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు చెలరేగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసని లక్నో.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో.. ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్ క్వింటన్‌ డికాక్ (54) హాప్ సెంచ‌రీతో విజృంభించాడు. కెప్టెన్ నికోలస్ పూరం(42), కృనాల్ పాండ్యా (41) పరుగులతో చెలరేగి ఆడారు. మార్కస్ స్టోయినిస్ (19), లోకేష్ రాహుల్ (15) పరుగుల పెవిలియన్ చేరారు.

ఇక పంజాబ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 3 పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ 2 తీసాడు. ఇక కగిసో రబడా, రాహుల్ చాహర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, పంజాబ్ జట్టు 200 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement