Tuesday, May 14, 2024

సెంటి మెంట్ అండ్ లవ్… రంగ్ దే ట్రైలర్

వెంకీ అట్లూరి డైరెక్ష‌న్‌లో నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ తెరకెక్కుతున్న చిత్రం రంగ్‌దే.సీతార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన విడుదలైన లుక్స్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.

మ‌నల్ని ప్రేమించే వారి విలువ మ‌నం వారిని వ‌ద్ద‌నుకున్న‌ప్పుడు కాదు..వాళ్లు మ‌న‌ల్ని అక్క‌ర్లేద‌నుకుప్పుడు తెలుస్తుదంటూ ల‌వ్ క‌మ్ సెంటిమెంట్ డైలాగులతో ట్రైలర్ రిలీజ్అయింది. చిన్న‌త‌నం నుంచి హీరోయిన్ పాత్ర‌ధారి కీర్తి సురేష్‌పై కోపంగా ఉండే నితిన్.. అనుకోని ప‌రిస్థితుల్లో అమెను పెళ్లిచేసుకోవ‌డం, ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి విడిపోతార‌నేది ట్రైల‌ర్‌ని చూస్తే అర్థంమ‌వుతోంది. ఇక ఈనెల 26న రంగ్‌దే రిలీజ్ కానుంది. ఇటీవ‌లే విడుద‌లైన చెక్ ఫ్లాప్ కావటంతో ఈ సినిమాపైనే త‌న ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నాడు నితిన్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement