Friday, May 7, 2021

ఆచార్య రిలీజ్ డేట్ పై కొత్త గాసిప్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

అయితే ఈ చిత్రం మే 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల కు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. వచ్చే జూలై నెలలో ఆఖరిలో గాని ఆగస్టు మొదటి వారంలో గానీ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా… మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News