Saturday, April 27, 2024

నెక్స్ట్ ప్రధాని సోనూసూద్…. మోదీ పరిస్థితి ఏంటి మరి?

గతేడాది కరోనా సమయంలో ఎంతో మంది ప్రజలకు సహాయసహకారాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనుసూద్. కష్టంలో ఉన్నామని ఎవరు చెప్పినా వెంటనే వారి కష్టాలను తీర్చి దేవుడయ్యాడు. ఇక అప్పటి నుంచి కూడా సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా భవిష్యత్ ప్రధాని సోనూసూద్ అంటూ కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తున్నారు.

అంతేకాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీసావంత్ కూడా సోనుసూద్ ను భవిష్యత్ ప్రధానిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని… సాధారణ వ్యక్తిగా ఉంటూ ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతాను అని క్లారిటీ ఇచ్చారు. నేను ఒక సామాన్య వ్యక్తిగా బాగానే ఉన్నాను. నా సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికలతో పోరాటం ద్వారా నేను ఏం పొందుతాను.. అది నా పని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు సోనుసూద్ ప్రధాని కావాలి అంటూ కమెడియన్ వీర్ దాస్ కూడా ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement