Sunday, May 5, 2024

వేర్ ఈజ్ సీత… సీత ఎక్కడ రాజమౌళి ?

రాజమౌళి మరోసారి దెబ్బేసాడు. అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 15 ఉదయం 11 గంటలకు సీత లుక్ ను విడుదల చేయబోతున్నట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక విషయం అనౌన్స్ చేసినప్పటినుంచి కూడా అభిమానులు ఆ సమయం కోసం ఎదురు చూశారు. అయితే ఆ సమయం వచ్చింది. కానీ సీత మాత్రం రాలేదు. దీంతో నెటిజన్లు రాజమౌళిపై ఫన్నీ కామెంట్లు చేయడం మొదలు పెట్టేశారు.

సీత ఎక్కడ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో సీతారామరాజు పాత్ర కు సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా రాజమౌళి ఇలానే లేట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ సీత లుక్ రిలీజ్ చేయకుండా ఆలస్యం చేయడం పట్ల అభిమానులు రాజమౌళి ని టార్గెట్ గా ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement