Saturday, May 4, 2024

లైవ్ లో సింగర్ సునీత వాట్సాప్ నెంబర్ అడిగిన నెటిజన్…

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక….సెలబ్రిటీలు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఫన్నీ ఫన్నీ సమాధానాలు చెబుతూ లైవ్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు. కాగా సింగర్ సునీత కూడా ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చి ఫ్యాన్స్ కోరిన పాటలను పాడుతూ మంచి ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతే కాకుండా ప్రతి రోజు లైవ్ లోకి వస్తూ సునీత ఈ పాటలను పడుతున్నారు.

ఈ నేపధ్యంలో నే ఓ నెటిజన్ మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి.. అంటూ సునీతని కోరాడు. దీనికి సో సారీ అండి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది సునీత. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని హాస్పిటల్స్ లో బెడ్స్ కూడా దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు సునీత.

Advertisement

తాజా వార్తలు

Advertisement