Tuesday, April 30, 2024

ప్రైవేట్‌ జెట్‌ కొనుగోలు చేసిన నయనతార.. సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే!!

సౌత్‌ ఇండియాలో టాప్‌ హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్‌ నయనతార ఒక‌రు. కాగా, ఇరవై ఏళ్లుగా సినీ రంగంలో తన జోష్‌ ఎక్కడా తగ్గ‌లేదు.. పెళ్లైన తర్వాత కూడా మంచి గ్లామర్ ని మెంటేయిన్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో నయన్‌ ప్రైవేట్ జెట్ కొన్నట్లుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, మళయాళం, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్న నయన్‌.. తాజాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ తో కలిసి జవాన్ మూవీలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్ సాధించింది. కాగా, ప్రైవేట్‌ జెట్‌తో పాటు నయన్‌ ఆస్తుల గురించి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ ఖుషీలో ఉన్న నయనతార కొత్త ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ప్రైవేట్ జెట్‌తో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం నయన్‌ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ విలువ రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం.

ఇటీవల విఘ్నేష్ శివన్, నయనతార ఒక నిర్దిష్ట వైట్-బ్లూ జెట్‌లో నుంచి బయటికి వస్తున్న ఫొటోలు ఆన్‌లైన్‌లోకి రావడంతో ఈ జంట ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లుగా తేలింది. ఫొటోలను పరిశీలిస్తే జెట్ లోపలి భాగం పూర్తిగా విలాసవంతంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. క్యాబిన్ లోపల విలాసవంతమైన సీట్లు ఇంకా మసాజ్ సౌకర్యాలు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా ప్రయాణికులు వస్తే వారికి సీటింగ్ సౌకర్యం కూడా ఉంది. టాయిలెట్లు, హ్యాండ్ వాషింగ్ బేసిన్లు విడివిడిగా ఉన్నాయి. జెట్‌ లోపల విశ్రాంతి కోసం పడకగది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నయనతార ఆస్తి విలువ రూ. 200 కోట్లు ఉన్నట్లు సమాచారం.

దీంతో, సౌంత్‌ ఇండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్న ఏకైక నటిగా నయనతార గుర్తింపు పొందింది. నయనతార, భర్త విఘ్నేశ్ శివన్ వృత్తిపరమైన పనులు, విహార యాత్రల కోసం ఈ ప్రైవేట్ జెట్‌ను వాడతారట. బాలీవుడ్ నటీమణులు శిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్‌లకు సైతం ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. వారి ప్రైవేట్ జెట్‌లు వేర్వేరు ధరలతో విభిన్న మోడళ్లతో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement