Saturday, May 4, 2024

RIP – హ్యారీ పోట‌ర్ ‘ఆల్బస్‌ డంబుల్‌ డోర్‌’ పాత్ర‌ధారి సర్ మైఖేల్ గాంబోస్ క‌న్నుమూత

హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. హాలీవుడ్‌ నటుడు, హ్యారీ పోటర్‌ ఫేమ్‌ సర్‌ మైఖేల్‌ గాంబోన్ కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 82 సంవత్సరాలు. న్యుమోనియాతో బాధపడుతున్న మైఖేల్‌ గాంబోన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను కుటుంబం ధ్రువీకరించింది. గాంబోన్‌ ‘హ్యారీ పోటర్‌’ సిరీస్‌లో ప్రొఫెసర్‌ ‘ఆల్బస్‌ డంబుల్‌ డోర్‌’ పాత్రను పోషించారు. ఐరిష్‌ నటుడి మరణవార్త ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement