Friday, May 3, 2024

రింగ్ లో అడుగుపెట్టిన గని

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. అల్లు బాబి సిద్దు ముద్ద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. ఓవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నా తగిన నిబంధనలు పాటిస్తూ ఈ సినిమా షూటింగ్ ను చిత్రయూనిట్ జరుగుతోంది.

ఇక ఈ సినిమాలో ప్రస్తుతం వరుణ్ తేజ్ నవీన్ చంద్ర పై బాక్సింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ బాక్సింగ్ ఎపిసోడ్ ను దిలీస్ సుబ్బరాయన్ ఆధ్వర్యంలో పిక్చరైజ్ చేస్తున్నారు. మరోవైపు జగపతిబాబు ,సునీల్ శెట్టి, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement