Saturday, April 27, 2024

ఏయూలో పరీక్షలు వాయిదా

ఏపీ: ఆంధ్రా యూనివర్సిటీలో ఈ నెలలో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ నెల 16 నుంచి జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ 4వ సంవత్సరం మొదటి సెమిస్టర్, ఎం.ఎస్ ఇంటిగ్రేటెడ్ అప్లయిడ్ కెమిస్ట్రీ 2వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలతో పాటు ఈ నెల 19 నుంచి నిర్వహించాల్సిన ఎంటెక్ 3వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement