Sunday, April 28, 2024

ఈ ఏడాది వర్షాలు గట్టిగానే పడుతాయట..!

అన్నదాతలకు శుభవార్త ఈ ఏడాది అత్యధికంగానే వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఈ సంవత్సరానికి సంబంధించి అంచనాలను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది కూడా రుతుపవనాలు ఎలాంటి తగ్గుదల లేకుండా సాధారణ వర్షపాతం అందిస్తాయని వెల్లడించింది. మరో రెండు నెలల్లో దేశంలో రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. వేసవి కాలం చివర్లో అరేబియా సముద్రం నుంచి భారత్ లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే నైరుతి సీజన్ లో 103 శాతం (5 శాతం అటూ ఇటూగా) వర్షపాతం నమోదవుతుందని, సగటున 880.6 మిమీ వర్షపాతం అందిస్తుందని స్కైమెట్ వివరించింది. మొత్తం మ్మీద దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థితిలోనే ఉంటుందని స్కైమెట్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement