Thursday, May 9, 2024

ఓటీటీ వద్దంటున్న నాని!!

కరోనా కారణంగా గతంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మొదట న్యాచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా ఓటీటీ లో విడుదలైంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఇటీవల థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ మళ్లీ కరుణ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. దీంతో 100% ఆక్యుపెన్సీ తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే చాలా సినిమాలు మళ్లీ ఓటీటీ వైపు చూస్తున్నాయి. మరి కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. కాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమా పై ఓ వార్త బయటకు వచ్చింది. దర్శక నిర్మాతలు ఓటిటి లో రిలీజ్ అంశాన్ని లేవనెత్తగా… నాని మాత్రం అందుకు నో చెప్పాడట. వంద శాతం ఆక్యుపెన్సీ వరకు ఎదురు చూద్దామని క్లారిటీ ఇచ్చాడట. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో… థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement