Thursday, May 2, 2024

ఘాటైన అవతార్‌లో నరేష్.. ఇంట్రెస్టింగ్‌గా ‘ఉగ్రం’ ట్రైల‌ర్

నాంది సినిమాతో స్ట్రాంగ్‌ బ్యాక్‌బ్యాక్‌ ఇచ్చిన అల్లరి నరేష్‌ మరోసారి అదే సినిమా దర్శకుడు విజయ్‌ కనకమేడలతో కలిసి ఉగ్రమ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా టీజర్, పాటలు సినీ అభిమానులను బాగా అలరించాయి. కాగా, ఇవ్వాల కొద్ది సేప‌టి క్రితం ఉగ్రం మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ట్రైలర్‌ను బట్టి సినిమాలో చాలా యాక్షన్ ఉండ‌నుంది అని తెలుస్తోంది. ఘాటైన అవతార్‌లో నరేష్ అద్భుతంగా క‌నిపిస్తున్నాడు. ట్రైల‌ర్ లో శ్రీచరణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎఫెక్టివ్‌గా ఉంది. ఉగ్రమ్ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా వ‌చ్చే నెల అంటే మే 5న థియేట‌ర్లలో రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement