Monday, April 29, 2024

నాని నీ న‌ట‌న.. శ్రీకాంత్ మేకింగ్ సూప‌ర్ – మెగాస్టార్ చిరంజీవి

ద‌స‌రా చిత్ర టీంపై మెగాస్టార్‌ చిరంజీవి దసరా’టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. హీరో..హీరోయిన్ నాని, కీర్తి సురేశ్‌ల నటనతో పాటు శ్రీకాంత్‌ ఓదెల మేకింగ్‌ చాలా బాగుందని కితాబిచ్చారు. డియర్‌ నాని.. దసరా సినిమా చూశాను. చాగా గొప్ప సినిమా ఇది. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పనితీరు చాలా బాగుంది. అసలు ఇది శ్రీకాంత్‌ ఓదెలకు తొలి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మా మహానటి కీర్తి సురేశ్‌ యాక్టింగ్‌ అదిరిపోయింది. దీక్షిత్‌ శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అదిరిపోయింది. మొత్తంగా టీమంతా కలిసి గొప్ప చిత్రాన్ని ఇచ్చారు’అని చిరంజీవి మెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క ట్వీట్ రాగానే శ్రీకాంత్ ఓదెల, ఎగిరిగంతేసాడు. ఈ ట్వీట్ చిరు పోస్ట్ చేసిన వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల “ఎగురుతున్నా, థాంక్యూ బాస్” అంటూ రిప్లై ఇచ్చాడు. తన చిన్నప్పుడు చిరు ఐకానిక్ స్టెప్ అయిన ‘వీణ స్టెప్’ని వేసిన ఫోటోని కూడా శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు. చిరు ట్వీట్ తో శ్రీకాంత్ ఓదెల ఎంత ఎగ్జైట్ అయ్యాడో ఆ ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది. నాని, కీర్తి సురేశ్‌ నటించిన తాజా చిత్రం ‘దసరా’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్‌ అదరగొట్టేశారని అంతటా ప్రశంసలు వచ్చాయి. కలెక్షన్స్ వర్షం కురిసింది. పూర్తి తెలంగాణ యాసలో నాని చెప్పే డైలాగ్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక విమర్శకులు సైతం ‘దసరా’పై ప్రశంసలు కురిపించారు.

https://twitter.com/odela_srikanth/status/1646392333653651456
Advertisement

తాజా వార్తలు

Advertisement