Friday, April 26, 2024

ఓటీటీలోకి రానున్న నాగారుజన ది ఘోస్ట్​.. స్ట్రీమింగ్​ ఎప్పుడంటే..

నాగార్జున ది ఘోస్ట్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. థియేట‌ర్ల‌లో విడుద‌లై నెల రోజులు గ‌డ‌వ‌క‌ముందే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ద‌స‌రాకు చిరంజీవి గాడ్‌ఫాద‌ర్‌కు పోటీగా ఈ సినిమా రిలీజ‌వ్వ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌లోని యాక్ష‌న్ స‌న్నివేశాలు, నాగార్జున యాక్టింగ్ కార‌ణంగా ది ఘోస్ట్ పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కాగా ఈ సినిమా న‌వంబ‌ర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను దాదాపు 55 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

ది ఘోస్ట్ సినిమాలో విక్ర‌మ్ అనే ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా నాగార్జున క‌నిపించాడు. త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను కాపాడ‌టం కోసం దుబాయ్ నుంచి ఇండియాకు వ‌చ్చిన అత‌డికి ఎదురైన అనుభ‌వాల‌ను యాక్ష‌న్ ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ సినిమాలో చూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement