Saturday, May 4, 2024

చిరంజీవి- నాగార్జున -మహేష్ చాటింగ్ లీక్

చిరంజీవి-నాగార్జున, నాగార్జున-మహేష్ వీరి వాట్సాప్ చాటింగ్ బయటికి వస్తే ఎలా ఉంటుంది ఇది వినడానికి ఎంతో క్యూరియాసిటీ గా ఉంది కదూ. అవును చిరంజీవి ,మహేష్ బాబులతో నాగార్జున చేసిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్ ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే వీటిని ఎవరో లీక్ చేశారు అనుకోవద్దు..స్వయంగా నాగార్జున ఈ చాటింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వైల్డ్ డాగ్వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రయిలర్ ను మహేష్ బాబు, చిరంజీవికి పంపించాడు నాగ్. ట్రయిలర్ చూసిన మహేష్ బాబు, చాలా బాగుందంటూ వాట్సాప్ లో రిప్లయ్ ఇచ్చాడు. అటు చిరంజీవి కూడా ట్రయిలర్ ను మెచ్చుకున్నాడు.దీంతో వాళ్ల అనుమతితో, ఆ స్క్రీన్ షాట్స్ ను నాగార్జున బయటపెట్టాడు. నిన్న వైల్డ్ డాగ్ ట్రయిలర్ ను చిరంజీవి లాంచ్ చేసారు. ఈ విషయంపై కూడా ఛాటింగ్ లో నాగ్-చిరు మాట్లాడుకున్నారు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. నాగ్ మరోసారి యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. వైల్డ్ డాగ్ గా అతడి లుక్ బాగుంది. కాకపోతే ఓటీటీల్లో ఇలాంటి యాక్షన్ సిరీసుల్ని చాలా చూశారు జనం. థియేటర్లలో నాగ్ కొత్తగా ఏం చూపించబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement