Sunday, April 28, 2024

మాన‌వ‌తా ప‌తాక ‘క‌ల్వ‌కుంట్ల క‌విత‌’….

తెలంగాణ బతుకమ్మ కవిత బర్త్‌డే నేడు
యూత్‌ ఐకాన్‌గా గుర్తింపు
ఆపద పలకరిస్తే… అక్కే భరోసా అంటున్న యువతరం
యువతను భిన్నరంగాల్లో ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ
ఉన్నత లక్ష్యాలను చేరుతున్న యువత
పేదింటి బిడ్డలకు చదువుల సాయం…
గల్ఫ్‌ బాధితులకు బాసట
రాజకీయ వ్యూహాల్లోనూ నేర్పరి

కవిత తండ్రి కేసీఆర్‌ లాగానే మానవతా పతాక. ఆపదలో ఎవరైనా ఉన్నారని తెలిస్తే కదిలేపోతారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమయ్యే సరస్వతీ పుత్రులెందరినో చేరదీసి.. సాయంగా నిలిచారు. ఆమె స్పందనలో ఫస్ట్‌.. సాయంలో బెస్ట్‌ అంటారు నేటి యువత. వందలాది మంది యువతీ యువకులు కవిత చొరవతో, చేసిన సాయంతో ఉన్నత విద్యను పూర్తిచేసి కొత్త శిఖరాలు అధిరోహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల ద్వారా వేలాది మంది యువత నైపుణ్యాభివృద్ధికి కృషిచేసి, జీవనోపాధికి బాటలు పరిచారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమం నాటి నుండి మండల స్థాయి వరకు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసిన కవిత ఇపుడు క్రియాశీలం చేస్తున్నారు.

హైదరాబాద్‌, : మారుతున్న రాజ కీయ పరిణామాలకు అనుగుణంగా యువ తరం తమ ప్రాధాన్యతలను ఎంచుకుంటోంది. భరోసానిచ్చే నేతల వైపు, స్ఫూర్తిదాయక నేతల వైపు యువతరం మొగ్గుతోంది. కల్వకుంట్ల కవిత.. ఇపుడు యువమంత్రమై మార్మోగు తోంది. యూత్‌ ఐకాన్‌గా, ఆపద పలకరిస్తే.. ఆదుకునే ఆపన్నహస్తంగా, విశ్వసనీయ భరోసాగా కనిపిస్తోంది. కవితక్కను ఆశ్రయిస్తే సాయం ఖచ్చితంగా లభిస్తుందన్న భరోసా యువతీయువకుల మాటల్లో ధ్వనిస్తోంది. కష్టం ఏదైనా.. కవితక్క దగ్గరికి వెళితే చాలు ఊరట లభిస్తుంది అన్న విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. అటు సాయంలోనే కాకుండా.. రాజకీయ వ్యూహాల్లోనూ, ప్రసంగాల్లోనూ తండ్రి కేసీఆర్‌, సోదరుడు కేటీఆర్‌ తరహాలో తనదైన మార్క్‌ ప్రదర్శిస్తోంది. ఒక్క నిజామా బాద్‌, హైదరాబాదే కాక.. రాష్ట్రమంతా ఛలో.. కవితక్క అంటూ ప్రతిరోజూ తమ చిరు సమ స్యలు, వినతులతో వందలాదిమంది కవితను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా యూత్‌ కవితకు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. సాయం కోసం వెళ్ళిన వారిని ఆత్మీయంగా పలకరించే తీరు, సమస్యను సావధానంగా వినే తీరు, యువత ను చదవుతో పాటు వివిధరంగాల్లో ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలతో యువత కవితకు జైకొడుతున్నారు. క్రికెట్‌ పోటీలు, ఇతర క్రీడా సాంస్కృతిక పోటీ లతో కవిత యువతలో నూతనోత్సాహం నింపుతుండగా.. ఆమె క్రేజ్‌ అనూ హ్యంగా పెరిగింది. సామాజిక మాధ్య మాల్లో ట్వీట్‌కు స్పందించి ఎంతోమంది యువతను చదువులో, ఉన్నత అవకా శాలు పొందడంలో, ప్రాణాలు నిలపడం లో, కష్టాల నుండి గట్టెక్కించడంలో తన వంతు పాత్ర పోషించారు. శనివారం కవిత జన్మదినం కాగా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నారు.
యూత్‌లో జోష్‌…
తెలంగాణ జాగృతికి రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు పటిష్ట కమిటీలు ఉండగా, ఇందులో ఉన్నవారంతా యువతే. కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఇటీవల కాలంలో దూకుడు పెంచగా, బీజేపీ వైపు వెళ్ళే యువతను ఈ కమిటీలు విస్తృతంగా ఆకర్షిస్తున్నాయి. కవిత దగ్గరికి వెళ్తే ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్తుందన్న భావన, సమస్యలు తక్షణం పరిష్కారమవు తాయన్న గురి కుదరడంతో యూత్‌లో జోష్‌ కనబడుతోంది. ఇతర పార్టీల వైపు యువత మొగ్గే అవకాశముందన్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా.. కవిత యూత్‌ ఐకాన్‌గా తన ప్రభావాన్ని ఆమెకు తెలియకుండానే పెంచుకుంటోంది.
ఊరూరా పునాదులు
క్రీడాపోటీలు, స్ఫూర్తిదాయక పోటీలు, యువతకు భవిష్యత్‌ పై కల్పిస్తున్న భరోసా… అక్క ఉంటే చాలు అంటూ అనేక యువక్లబ్‌లు కవిత బాటలో పయనిస్తు న్నాయి. ఉద్యమ సమయంలో ఓ వైపు టీఆర్‌ఎస్‌, మరోవైపు జెెఏసీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ రెండింటితో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన కవిత ఊరూరా బలమైన పునాదులు, ప్రత్యేకమైన అభిమానవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ బతుకమ్మగా నీరాజనాలు అందుకున్నారు. కవిత ఇపుడు జిల్లాల్లో ఉత్సాహంగా పర్యటిస్తుండడంతో భవిష్యత్తు.. భరోసా కవితక్కే అంటూ యువకులు పెద్ద ఎత్తున ఆకర్షితులవు తున్నారు. ఇతర జిల్లాలకు రమ్మంటూ ఒత్తిడి చేస్తున్నారు. మాటకారితనం, ప్రజలను ఆకర్షించే సమ్మోహనాస్త్రం, సాయం చేసే గుణం.. వెరసి తెలంగాణ యువతరంపై తండ్రి కేసీఆర్‌ స్ఫూర్తిగా బలమైన ముద్ర వేస్తున్నారు. ఆకర్షణీయనేతగా.. ఆకట్టుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement