Saturday, April 27, 2024

లవ్ స్టొరీ సినిమా రిలీజ్ వాయిదా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. అయితే ఈ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత నారాయణ దాస్ కె నారంగ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… సినిమా చాలా బాగా వచ్చిందని కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా లవ్ స్టోరీ అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇప్పటివరకు విడుదలైన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని హీరో నాగచైతన్య అన్నారు. సినిమా అంతా పూర్తి అయిన తర్వాత విడుదల వాయిదా వేయాలి అంటే నిర్మాతలకు చాలా ధైర్యం ఉండాలి అని చైతన్య చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా సారంగదరియా పాట ఎంతటి ఫేమస్ అయిందో చెప్పనవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement