Friday, April 26, 2024

శిల్పా శెట్టిని ప్రశ్నించనున్న పోలీసులు..?

బాలీవుడ్ నటీ శిల్పా శెట్టి భర్త ఫోర్న్ రాకెట్ లో అరెస్టయిన విషయం తెలిసిందే.. అయితే ఈ రాకెట్ లో శిల్పశెట్టి ప్రమోయం లేదని అందరూ భావించారు.. అందుకు తగ్గట్లుగానే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే గురువారం తెలిపారు. కాని.. క్రైం బ్రాంచ్‌ పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారని తెలియడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా పోలీసులు శిల్పాశెట్టిని విచారించడానికి రాజ్‌కుంద్రా ఇంటికి వెళ్లడంతో ఉత్కంఠ తారా స్థాయికి వెళ్లింది. వారి వెంట రాజ్‌కుంద్రా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన మరింత లోతుగా విచారించేందుకు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్‌ అయిన కుంద్రా పోలీసు కస్టడీని ముంబై  మేజిస్ట్రేట్ జూలై 27వరకు పొడిగించిన సంగతి తెలిసిం‍దే. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కుంద్రా నోరు విప్పడం లేదని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్‌కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఏడాదిన్నరలో వంద పోర్న్‌ వీడియోలు తయారు చేసినట్లు కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కుంద్రా పోర్న్‌ యాప్‌కు 20 లక్షల మంది సబ్ స్కైబర్స్ ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఇది కూడా చదవండి : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్ లో జిన్ పింగ్ అనూహ్య పర్యటన..

Advertisement

తాజా వార్తలు

Advertisement