Thursday, April 25, 2024

బైంసాలో బీజేపీ నేతల ఆందోళన.. తొక్కిసలాట

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా తయారైంది. ఈ క్రమంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండెగాం గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులకు విన్నవించుకోగా వారు కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన ముంపు బాధితులు శుక్రవారం బైంసాలోని నిర్మల్ చౌరస్తాలో నిరసనకు దిగారు. వీరికి బీజేపీ నేతలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో కలిసి బాధితులు రోడ్డుపై బైఠాయించారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండటంతో పోలీసులు వీరిని ఎంత సముదాయించినా వినలేదు. కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యే ఇక్కడికి రావాలని బాధతులు పట్టుపట్టారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ తమ గ్రామం మునిగిపోతుందని, శాశ్వత పరిష్కారం చూపాలని మొత్తుకున్నారు. చివరకు నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు వచ్చి బాధితులకు నచ్చచెప్పారు. అయినా వారు వినలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తన నిరసన విరమించేందుకు నిరాకరించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తొక్కిసలాట జరిగింది.

ఈ వార్త కూడా చదవండి: అనుమానంతో భార్యాపిల్లలను చంపిన భర్త

Advertisement

తాజా వార్తలు

Advertisement