Friday, May 3, 2024

ఓటీటీ లో రికార్డ్ సృష్టించిన మిల్కీ బ్యూటీ!!

ఇటీవల కాలంలో డిజిటల్ రంగానికి డిమాండ్ పెరిగింది. సినీ అభిమానులంతా కూడా వెబ్ సిరీస్ లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇటీవల మిల్కీబ్యూటీ తమన్నా నటించిన నవంబర్ స్టోరీస్ హాట్ స్టార్ లో లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు అత్యధిక వ్యూస్ ను రాబడుతోంది. ఈ ఏడాది అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా ఇది రికార్డు సాధించింది. ఇక ఇదే విషయమై తమన్నా స్పందిస్తూ కంటెంట్ బాగుంటే ఆదరించడానికి భాషా భేదాలు ఉండవు అన్న విషయం దీంతో రుజువైందని చెప్పుకొచ్చారు.

ఇక తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సిటీ మార్ సినిమాలో నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించనుంది. అలాగే నితిన్ అందధూన్ రీమేక్ లో కూడా నడుస్తుంది. మరోవైపు ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement