Monday, May 20, 2024

చంద్రబాబు కు మెగాస్టార్ స్పెషల్ విషెస్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టిడిపి కార్యకర్తలు సినీ రాజకీయ ప్రముఖులు చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ లు చేస్తున్నారు.

కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలుతెలియజేశారు. అమితంగా శ్రమించే మరియు గట్టి కమిట్మెంట్ ఉన్న నాయకుల్లో ఒకరైన నారా చంద్ర బాబు నాయుడుకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు.. అలాగే ఆయురాగోగ్యాలతో మరియు సుఖసంతోషాలతో ప్రజలకు మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నాను అంటూ చిరు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement