Wednesday, May 8, 2024

మెగాస్టార్ చిరంజీవి @1మిలియన్ ఫాలోవర్స్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అడుగుపెట్టినా సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక విషయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అభిమానులకు టచ్ లో ఉంటూ ఉంటారు. అయితే గతేడాది మార్చి 25 ఉగాది రోజు ట్విట్టర్ లో అడుగుపెట్టారు చిరంజీవి. ఇక మొదటి రోజు నుంచే ఫాలోవర్స్ విపరీతంగా వచ్చారు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. వీటి తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement