Friday, May 3, 2024

‘మీట్‌ రిషి, ఆర్య ఇన్‌ ఇటలీ’

సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 20న ‘మీట్‌ రిషి, ఆర్య ఇన్‌ ఇటలీ’ అని ఒక వీడియో ద్వారా చిత్ర బృందం వెల్లడించింది. విభిన్న మనస్తత్వాలు కలిగిన రిషి, ఆర్యల మధ్య అందమైన లవ్లీ రిలేషన్‌ షిప్‌ ని ప్రజంట్‌ చేస్తోంది. వారి ప్రయాణం ఆసక్తికరంగా వుంది. వీడియోలోని చివరి భాగం పూర్తి వినోదం వుంది.మిక్కీ జె మేయర్‌ సంగీతంలో ఇప్పటివరకు రెండు పాటలను విడుదల చేసారు.
ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, నరేష్‌, గౌతమి, షావుకారు జానకి, వాసు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement