Monday, May 6, 2024

కంగ‌నా రానౌత్ ‘చంద్ర‌ముఖి 2’ నుంచి మాస్ మ‌సాలా సాంగ్ …

YouTube video

స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ భామ కంగన రనౌత్ జంటగా సీనియర్ దర్శకుడు పి.వాసు డైరెక్షన్ లో వస్తున్న చిత్రం చంద్రముఖి-2. గతంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖికి ఇది సీక్వెల్. కాగా, చంద్రముఖి-2 చిత్రం నుంచి ఓ పక్కా మాస్ సాంగ్ ను చిత్రబృందం నేడు రిలీజ్ చేసింది. “మోరునియే మోరునియే… నాచే మోరునియే” అంటూ సాగే ఈ హుషారైన గీతానికి కీరవాణి బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఎస్పీ చరణ్, శ్రీనిధి తిరుమల ఆలపించారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన చంద్రముఖి-2 సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement