Sunday, May 5, 2024

Mangalavaaram | ఇక ఓటీటీలో పాయల్ రాజ్‌పుత్ హవా.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో

దర్శకుడు అజయ్ బూపతి తెరకెక్కించన బాక్సీఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌‌గా మూవీ RX100. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్.. కాగా, ఆర్‌‌ఎక్స్100 తరువాత పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి మరోసారి కలిసి చేసిన‌ రూరల్ మిస్టరీ థ్రిల్లర్, ‘మంగళవరం. నవంబర్ 17న విడుదలైన ఈ సినిమాలో మరోసారి బోల్డ్ రోల్ చేసిన పాయల్ రాజ్‌పుత్ త‌న పర్ఫామెన్స్ తో ప్రేక్షకుల‌ను క‌ట్టిప‌డేసింది. ఇక డైరెక్టర్ అజయ్ భూపతి బోల్డ్ కాన్సెప్ట్‌తో మిస్టరీని లాంగ్‌గా మెయింటైన్ చేస్తూ కథను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయవంతమై లాభాలను ఆర్జించింది.

కాగా, పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌లో మ‌రో హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెర్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా, ఈ మూవీ ఈ నెల 22న ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు నెర్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తొంది. అయితే, మంగళవరం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మరో ఓటీటీ ‘ఆహా’ కూడా దక్కించుకున్నట్టు సమాచారం. అయితే, దీని ఆహా అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement