Monday, October 7, 2024

సకల పాప హరిణి ఉత్పన్న ఏకాదశి

కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమ హావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. శ్రీ మహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా విశిష్టమైనది గా చెబుతారు. ఉపవా సాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి. ఉత్పన్న ఏకాదశి నాటి ఉపవాసం సకల పాపాలను హరింప చేసేదిగా చెపుతారు.
ఉత్పన్న ఏకాదశి మహాత్మ్యము శ్రీకృష్ణార్జున సంవాద రూపమున భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. శ్రీకృ ష్ణుడు: ”అర్జునా! శరదృతు ముగింపులోని ఏకాదశి, అంటే కార్తీకమాస కృష్ణపక్ష ఏకాదశి రోజు మనుజుడు ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి. ఏకాదశి ప్రొద్దుననే అతడు ఉపవా స వ్రతాన్ని చేపట్టాలి. స్నానం చేసే సమయంలో అతడు ”ఓ అన్యక్రాంతే! ఓ రథక్రాంతే! ఓ విష్ణుక్రాంతే! ఓ వసుంధరే! ఓ మృత్తికే! ఓ ధరణీ! నేను పరమగతిని పొందు నా పూర్వజన్మ ల పాపములన్నింటిని నశింప జేయుడు” అని ప్రార్థించాలి. స్నానానంతరము అతడు గోవిందుని పూజించాలి.” అని వివరించారు.
”శ్రీకృష్ణుని ద్వారా వర్ణితమైన ఈ ఏకాదశి వ్రతాన్ని మానవుడు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే లేదా దాని మహమను, విధి నియమాలను శ్రవణము చేస్తే ఈ జన్మలో సుఖమును పొంది తదుపరి జన్మలో విష్ణులోకాన్ని చేరుతాడు” అని సూ త మహర్షి శౌనకాది మునులకు వివరించారు.
ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సం#హరించే సం దర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒకటి. అలా ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు.
ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలు పరిహారమవుతాయి. ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశుల లో ఉపవాసం చేసి న ఫలితం కలిగి వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ఈ రోజు ఉపవాసం ఆచరిస్తే ముక్తి పొందుతా రు. ఉత్పన్న ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ వుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఏకాదశినాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటినుంచి ఏకాదశి ఘడియలు ముగిసేవరకూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. కొందరు నిరాహారం పాటిస్తూ, కేవలం నీటితో మాత్రమే గడుపుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement