Sunday, May 5, 2024

అఖిల్ కు విలన్ గా మమ్ముట్టి ?

అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా… సరైన హిట్ ని మాత్రం కొట్టలేకపోయారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. అలాగే ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.

ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement