Thursday, May 16, 2024

మ‌ళ్లీ పెళ్లి టీజ‌ర్..నరేశ్ మాజీ భార్యగా వనిత విజయ్‌ కుమార్‌

మ‌ళ్లీ పెళ్లి టీజ‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. కాగా ఈ చిత్రంలో సీనియర్ న‌టులు న‌రేశ్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్నారు. విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేశ్ నిర్మించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మే నెలలో విడుదల చేయనున్నట్లు టీజర్ చివరిలో ప్రకటించారుతాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. నరేశ్ తన జీవితంలో జరిగిన వివాదాలనే సినిమాగా చేస్తున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకు వచ్చిన చేసిన ఆరోపణలు.. హోటల్‌లో నరేశ్, పవిత్రా లోకేశ్ కనిపించడం.. రమ్యను చూస్తూ నరేశ్ విజిల్స్ వేసుకుంటూ వెళ్లడం.. ఇదంతా మీడియా ఎదుటే జరగడం వంటి సన్నివేశాలతో టీజర్ మొత్తం నింపేశారు. మొత్తంగా రియల్‌ ఇన్సిడెంట్స్‌ని రీల్‌లోకి కన్వర్ట్‌ చేసినట్లుగా కనిపిస్తోంది. నరేశ్ మాజీ భార్య పాత్రలో తమిళ నటి వనిత విజయ్‌ కుమార్‌ నటించారు. ఈ చిత్రంలో జయసుధ, శరత్ బాబు కూడా నటించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement