Sunday, April 28, 2024

మ‌ళ్లీ పెళ్లి.. టీజ‌ర్ అప్ డేట్

సీనియ‌ర్ న‌టులు న‌రేశ్..ప‌విత్రా లోకేష్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం మళ్లీ పెళ్లి. ఎంఎస్‌రాజు తెర‌కెక్కించ‌నున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. త్వరలో టీజర్‌ విడుదల చేయబోతున్నారు. ఈ నెల 13న టీజర్‌ ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో నరేష్‌ కోట్ ధరించగా, పవిత్ర లోకేష్‌ చీరలో మెరిసింది. సినిమా పోస్టర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌, టైటిల్స్ కలర్‌, వీరి డ్రెస్‌ కలర్స్ మ్యాచింగ్‌లా ఉండటం విశేషం. ఈ కొత్త లుక్‌ ఆకట్టుకుంటుంది. మరి ఈ గురువారం విడుదలయ్యే టీజర్‌లో ఈ ముదురు జంట తమ విశ్వరూపం చూపించబోతున్నారని చెప్పొచ్చు. ఇక నరేష్‌ చిత్ర పరిశ్రమలోకి వచ్చి యాభై ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా తన గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌ ఫిల్మ్ గా మళ్లీ పెళ్లిని తెరకెక్కిస్తుండటం ఓ విశేషమైతే, ఇందులో తనకు కాబోయే భార్యతో కలిసి నటిస్తుండటం మరో విశేషం. ఈ సినిమాని ఎంఎస్‌ రాజు రూపొందిస్తుండగా, విజయ్‌ కృష్ణ మూవీస్‌ పతాకంపై వీకే నరేష్‌ తెలుగు, కన్నడలో నిర్మిస్తుండటం విశేషం. పవిత్ర లోకేష్‌ కన్నడలో పాపులర్‌ కావడంతో దీన్ని బైలింగ్వల్‌గా రూపొందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement