Monday, May 13, 2024

అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ ?

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అక్కినేని అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహాలో పై కనిపించనున్నాడట. ఇక ఈ సినిమా కోసం వక్కంతం కథను అందిస్తుండగా అఖిల్ పూర్తి గెటప్ చేంజ్ చేశాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించేందుకు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ను సంప్రదించారట యూనిట్. పాత్రకు మోహన్లాల్ అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ కూడా భావిస్తోందట. ఇక అఖిల్ మోహన్ లాల్ కాంబినేషన్లో సినిమా అనగానే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. కాగా డిసెంబర్ 27న సినిమాను విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement