Monday, April 29, 2024

‘మేక్ ఎ విష్’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

AKAM ఫిలిమ్స్ ప‌తాకామ్ పై కిరణ్ కస్తూరి నిర్మాతగా సంధ్య బయిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం మేక్ ఎ విష్.ఈ చిత్రం సస్పెన్స్ డ్రామాతో ఇది ముగ్గురు స్త్రీల కథ, వారి ప్రేమ కథలు పాటు వారి సంబంధాల సమస్యల చుట్టూ తిరుగుతుంది, కథ మొత్తం వారి జీవితంలోకి చొరబడిన వ్యక్తితో టైమ్‌లైన్‌లో ముందుకు వెనుకకు తిరుగుతుంది. ఈ చిత్రం వాషింగ్టన్ డీసీ, యు ఎస్ ఎ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రసన్న కుమార్ , రామసత్యనారాయణ , ఈ చిత్ర నిర్మాణ నిర్వహణ గా ఉన్న భవాని శ్రీను ( ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ) చేతుల మీదుగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

నటీనటులు: సంధ్య బాయిరెడ్డి, కిరణ్ కస్తూరి, రచన యాదనపూడి, అభిషేక్ సబ్బే, వరుణ్ వేగినాటి, కార్తీక్ కందాళ,
స్టోరీ:కిరణ్ కస్తూరి & సంధ్య బయిరెడ్డి,
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రణీత్ మ్యూజికల్,
సినిమాటోగ్రఫీ : మహావీర్ అభిమన్యు & అడ్రిఎన్ రిలే,
ప్రొడ్యూసర్: కిరణ్ కస్తూరి,
డైరెక్టర్: సంధ్య బయిరెడ్డి,
నిర్మాణ నిర్వహణ: జి శ్రీనివాస్ (భవాని శ్రీను)
పి ఆర్ ఓ: ch రాంబాబు ( సినిమా బజార్ )

Advertisement

తాజా వార్తలు

Advertisement