Monday, April 29, 2024

మహేష్ లుక్ ఏమన్నా ఉందబ్బా!! కరోనా ఎఫెక్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఆడవాళ్ళలో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా 25 ఏళ్ల కుర్రాడిగానే కనిపిస్తూ ఉంటారు మహేష్ బాబు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో మహేష్ బాబు లుక్ ఒకటి వైరల్ అవుతుంది. అది చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తన కూతురు సితార తో కలిసి మహేష్ ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలో మహేష్ బ్లాక్ కూలింగ్ గ్లాస్ పట్టుకుని లాంగ్ హెయిర్, గడ్డం మీసాలతో కనిపించాడు. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్ ఈ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement