Wednesday, December 4, 2024

బుర్రిపాలెంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న మ‌హేశ్

సూపర్‌ స్టార్‌ కృష్ణ నేడు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన తండ్రి పుట్టిన రోజు నాడు ఆయన అభిమానులను, తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ తమ స్వగ్రామమైన బుర్రిపాలెంలో ప్రజలకు అత్యవసరమైన వైద్య సహకారాన్ని అందిస్తున్నారు.

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బుర్రిపాలెం ప్రజలు కరోనా బారిన పడకుండా కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఈ రోజు నుంచి ప్రారంభించి వరసగా ఐదు రోజుల పాటు కొనసాగిస్తున్నట్లు మహేశ్‌ అభిమానులు తెలియజేశారు. 12 మున్సిప‌ల్‌ వార్డులున్న బుర్రిపాలెంలో రోజుకు రెండు వార్డులు చొప్పున ఆరు రోజులు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వారు తెలిపారు. ముఖ్యంగా ముందుగా 45 ఏళ్ళకు పైబడి వయసున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడంతో ఈ కార్యక్రమం ఆరంభమవుతుందని అభిమానులు అన్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ అభిమాన కథానాయుకుడు, బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని తమ కోసం ఏర్పాటు చేసిన ప్రిన్స్ మహేశ్‌కి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement