Friday, January 17, 2025

200 మిలియన్ వ్యూస్@ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇష్మార్ట్ శంకర్. వరుస ఫ్లాపులతో ఉన్న పూరి జగన్నాథ్ ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన నభానటేష్, నిధి అగర్వాల్ నటించారు. అయితే ఈ సినిమా హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో అక్కడ కూడా మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది.

హిందీ వెర్షన్ యూట్యూబ్ లో తాజాగా 200 మిలియన్ల క్రాస్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఇదే విషయమై చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. అలాగే రామ్ త్వరలో లింగు స్వామి తో ఓ సినిమా చేయబోతున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement