Monday, May 20, 2024

SKLM: లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలి..

ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీఓల పాత్ర కీలకం
జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలానీ సమూన్

శ్రీకాకుళం (ప్రభ న్యూస్ బ్యూరో) మే 9: ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీఓలు కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజిర్ జిలానీ సమూన్ పీవోలు, ఏపీఓలను దిశా నిర్దేశం చేయాలని ఆర్.ఓలకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నుండి ఆయన ఎనిమిది నియోజక వర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలో చేపడుతున్న పనులపై ఆరాతీశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ…. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులపై ఉందన్నారు. పీఓలు, ఏపీఓలు చేపడుతున్న పనులపై ఆర్.ఓ లు ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తొలుత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మాదిరి పోలింగ్ ఎలా నిర్వహించాలో స్వయంగా వారి చేతుల మీదుగా తెలుసుకోవాలన్నారు. మాదిరి పోలింగ్ చేశాక ఆ స్లిప్పులను జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. అనంతరం సిఆర్సి( క్లోజ్ రిజల్ట్ క్లియర్) తప్పనిసరిగా చేసిన తర్వాతనే సాధారణ పోలింగ్ మొదలు పెట్టాలన్నారు. పోలింగ్ జరిగే సమయంలో ఈవీఎంలు మొరాయిస్తే ఏమి చేయాలో ప్రతి ఒక్క పీఓ, ఏపీఓకు తెలియాల్సి ఉందన్నారు.

ఈవీఎంలో ఒక ఓటు పడిన తర్వాత ఏదైనా సమస్య తలెత్తితే రెండో ఈవీఎంను వినియోగించాలని పోలింగ్ పూర్తయిన పిదప మొదటి ఈవీఎంతో పాటు రెండో ఈవీఎంను కూడా రిసెప్షన్ కేంద్రంలో అప్పగించాల్సిన బాధ్యత పీఓపై ఉందన్నారు. పోలింగ్ జరిగే సమయంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఆ విషయం వెంటనే సంబంధిత సెక్టోరల్ అధికారికి, ఏఆర్ఓకు, రిటర్నింగ్ అధికారికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో నియోజకవర్గాల ఆర్వోలు నూరుల్ ఖమర్, భరత్ నాయక్, సి.హెచ్ రంగయ్య, లక్ష్మణ మూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement