Friday, March 29, 2024

కేజీఎఫ్ 2 నుంచి మరో పోస్టర్ !!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కే జి ఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లు కూడా సాధించింది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఈ పార్ట్ 2 లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ కేజిఎఫ్ టైమ్స్ మ్యాగజైన్ పేరుతో విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ చిత్రంలో ఇనాయత్ ఖలీల్ గా నటిస్తున్న బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఇనాయత్ ఖలీల్ పాత్ర గురించి రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇనాయత్ ఖలీల్ అతి పెద్ద సామ్రాజ్యం నరాచిని ఆక్రమించడానికి ఇనాయత్ ఎవరితో చేతులు కలుపుతాడు. అలాగే ఇండియాలో ఎక్కడో తెలియని ప్లేస్లో తన బర్త్ డే ని జరుపుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement