Monday, April 29, 2024

‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలితో మహేష్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా మహేష్ ఈ సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు గతంలో వైరల్ అయ్యాయి. అయితే దీని కన్నా ముందు మరో సినిమాని ప్లాన్ చేసే పనిలో మహేష్ ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది.

ఈ నేపధ్యంలోనే త్రివిక్రమ్ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ తో పాటు మరో డైరెక్టర్ తో కూడా ఇంకో సినిమాను మహేష్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈసారి తమిళ దర్శకురాలు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు. ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న సుధా కొంగర. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో మాత్రం తెలియట్లేదు. కానీ ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement