Monday, April 29, 2024

మ‌హేశ్ బాబు కూతురికి.. ఆలియాభ‌ట్ గిఫ్ట్

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కుమారై సితార‌కి గిఫ్ట్ పంపింది బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్. సితార‌కి దుస్తులు గిఫ్ట్ గా పంపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సితార తెలియజేశారు. ‘మీ ఫ్యామిలీలో నన్ను ఒకరిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీ బహుమతులు నాకు ఎంతగానో నచ్చాయి’ అని కామెంట్ చేశారు. అలియా పంపిన దుస్తులు ధరించి ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సితార పోస్ట్ వైరల్ అవుతుంది. పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. అలియా భట్ ఈద్ ఏ మమ్మ పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ నడుపుతున్నారు. కిడ్స్ వేర్ కి సంబంధించిన ఈ బ్రాండ్ ని అలియా తనదైన శైలిలో ప్రోమోట్ చేస్తున్నారు. గతంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పిల్లలకు కూడా అలియా భట్ దుస్తులు గిఫ్ట్ గా పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement