Thursday, May 9, 2024

ల‌వ్ యు మై బండ ఫెలో టాంగో.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌న‌ల్ నోట్

నిన్ను త‌లుచుకున్న‌ప్పుడు నా మ‌న‌సు ఆనందంగా ఉంటుంద‌ని ఎమోష‌న‌ల్ నోట్ రాశారు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది. నన్ను నువ్వు రక్షించావు, నవ్వించావు. నా కష్టాల్లోనూ, నా సంతోషాల్లోనూ నువ్వు నాతో ఉన్నావు. నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నిన్ను పొందడం నా అదృష్టం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు ఇప్పటికి స్పెషల్ మూమెంట్ లాగా గుర్తుంది. లవ్ యు మై బండ ఫెలో.. టాంగో.. అంటూ రాశాడు తేజ్. వివ‌రాల్లోకి వెళ్తే.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎప్ప‌టినుండో ఓ కుక్కని పెంచుకుంటున్నారు. తేజ్ తన కుక్కకు టాంగో పేరు కూడా పెట్టాడు. ఆ కుక్క అంటే సాయి తేజ్ కు చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు చాలా టైమ్ ను ఆ కుక్కతోనే స్పెండ్ చేసేవారు. అంతే కాదు తన కుక్క టాంగోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తన కుక్క టాంగో చనిపోవడంతో చాలా బాధపడ్డారు సాయి తేజ్. తన కుక్కతో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటూ… సోషల్ మీడియాలో పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. తన కుక్క చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి తీసుకున్న ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ లెటర్ షేర్ చేశాడు తేజ్. ఈ లెటర్ లో.. తన బాధని వ్యక్త పరుస్తూ..ఓ పెద్ద నోట్ ను రాశారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement