Saturday, April 27, 2024

వకీల్ సాబ్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేస్తుంది!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా లాంగ్ గ్యాప్ తరువాత వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కు ఏమాత్రం తగ్గకుండా చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటించగా.. అంజలి, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా విజయం సాధించడంలో ముఖ్య పాత్ర థమన్ కు కూడా ఉందని చెప్పాలి. సినిమా పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు థమన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను విడుదల చేయనున్నట్లు కన్ఫామ్ చేశారు. దీనికోసం మ్యూజిక్ లవర్స్ కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement