Friday, May 17, 2024

LEO పార్ట్ 2 పై లేటెస్ట్ అప్‌డేట్ !

విజయ్ దళపతి హీరోగా.. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మూవీ ‘లియో’. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లియో సినిమా విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ మూవీ సెకండ్ పార్ట్ పై డైరెక్టర్ లోకేష్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఈ మూవీకి సీక్వెల్‌ రానుందా అని అడిగిన ప్రశ్నకు లోకేష్‌ సమాధానం ఇచ్చారు.

లియో సినిమా పార్ట్‌2 కచ్చితంగా ఉంటుంది.. ప్రస్తుతం విజయ్‌ ఆశయం సినిమాలకు భిన్నంగా ఉంది. అందుకు అభినందిస్తున్నా. విజయ్‌ ఒప్పుకుంటే లియో 2 ఉంటుంది. దానికి సమయం అనుకూలించి, విజయ్ ఎప్పుడు నాకు ఫోన్‌ చేస్తే అప్పుడు మూవీ మొదలవుతుంది. అలాగే లియో సెకండాఫ్‌ మిస్టేక్స్ రిపీట్ చేయను. ఇకపై చేసే సినిమాల్లో ఆ తప్పులు లేకుండా చూసుకుంటాను అని లోకేష్ అన్నారు. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని తెలిసిన విజయ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement